తిరుపతమ్మ దేవాలయం ప్రసాదం పోటులో అగ్ని ప్రమాదం- అప్రమత్తమైన సిబ్బంది - Tirupathamma Temple Fire Accident - TIRUPATHAMMA TEMPLE FIRE ACCIDENT
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 10, 2024, 1:33 PM IST
Fire Accident in Tirupathamma Temple: ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవాలయం లడ్డు ప్రసాదం పోటు (తయారీ కేంద్రం)లో స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయం లడ్డు ప్రసాదాలు తయారు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయని ఆలయ సిబ్బంది తెలిపారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
Fire Controlled With Co2 Extinguinsher Cylinder: అక్కడ ఉన్న ఆలయ సిబ్బంది సీఓటు సిలిండర్ (CO2 Cylinder) సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు. వెంటనే ఆలయ అధికారులు జగ్గయ్యపేట అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వటంతో ఆలయానికి చేరుకున్నారు. మంటలు రావడానికి గల కారణాలు పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం ప్రసాదం పోటులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆలయ అధికారులు, సిబ్బందికి వివరించారు. కార్మికులు మరింత అప్రమత్తంగా, జాగ్రత్తగా వ్యవహరించాలని అగ్నిమాపక సిబ్బంది సూచించారు. అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.