ఓటు అనే ఆయుధంతో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతాం: అమరావతి రైతులు - Farmers Held Was Rally
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 14, 2024, 9:02 AM IST
Farmers Held Was Rally to Save Amaravati: సీఎం జగన్ ఐదు సంవత్సరాల పాలనలో ప్రజలు విసిగిపోయారని అమరావతి రైతులు విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి లేకపోవడంతో ఉద్యోగాలు లేక ఇంటి దగ్గర ఖాళీగా కూర్చున్నామని నిరుద్యోగులు వాపోయారు. అమరావతిని కాపాడుకుందాం- కలిసి రండి కదలి రండి అనే నినాదంతో రైతులు ర్యాలీ నిర్వహించారు. ఫిరంగిపురం మండలంలోని కండ్రికలో మహిళలు ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను పంపిణీ చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీను ఓడిస్తేనే రాష్ట్ర భవిష్యత్తు ఉంటుందని రైతులు పేర్కొన్నారు. ఉచిత పథకాలు ఏ ప్రభుత్వాలైనా ఇస్తాయి కానీ అభివృద్ధి చేసే మంచి నాయకులను ఎన్నుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ప్రజలకు రైతులు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత అయిదేళ్లుగా రాజధానికి జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. రాజధాని విషయంలో జగన్ కక్షపూరితంగా వ్యవహరించి అమరావతిని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తేనే నిరుద్యోగుల భవిష్యత్తుతోపాటు మళ్లీ అమరావతినే రాజధానిగా కొనసాగిస్తారని వారంతా ఆశాభావం వ్యక్తం చేశారు.