రైతుల పాలిట శాపంలా వైఎస్సార్సీపీ పాలన- ఐదేళ్లలో ఒక్క రాయితీ ఇవ్వలేదు : రైతులు - farmers fire on jagan - FARMERS FIRE ON JAGAN
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 4, 2024, 7:52 PM IST
Farmers Fire on YCP Government : వైఎస్సార్సీపీ పాలన రైతుల పాలిట శాపంగా మారిందని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయకుండా పొలాలను ఎండబెట్టారని మండిపడుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం సబ్సిడీతో డ్రిప్ పరికరాలు, వ్యవసాయ పనిముట్లు అందిస్తే వాటన్నింటినీ జగన్ ఎత్తేశారని మండిపడుతున్నారు. కేవలం బటన్ నొక్కి డబ్బులు వేశామని గొప్పులు చెప్పుకోవడం తప్ప రైతులకు జగన్ చేసిందేమి లేదంటున్నారు. ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో వ్యవసాయ రాయితీ పథకం ఒక్కటి కూడా అమలు చేయలేదని ఉద్యాన పంటలు సాగుచేసిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలు నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ రాయితీ కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కిందన్నారు.
తెలుగుదేశం ప్రభుత్వంలో రైతులకు రాయితీపై బిందు, తుంపర్ల సేద్య పరికరాలు ఇచ్చేేవారని చెప్పారు. ఉద్యాన పంటలు సాగుచేస్తున్న తమకు ఏ పథకాలు ఇవ్వని కారణంగా పెట్టుబడి భారం పెరిగి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామన్నారు. ఐదేళ్లలో రైతులకు ఏ చిన్న వ్యవసాయ రాయితీ పథకం కూడా అమలుచేయలేదని విమర్శించారు. గతంలో గడ్డిమందు మొదలు, వ్యవసాయ యంత్ర పరికరాలన్నీ రాయితీపై అందుకున్నామని రైతులు వెల్లడించారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పచినుంచి వాటన్నింటనీ జగన్ ఎత్తేశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.