ఐదేళ్లు వైఎస్సార్సీపీ రివర్స్ పాలన - నేడు అన్నదాతలకు శాపాలు - Leakage Of Konam Project
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 16, 2024, 2:17 PM IST
Farmers Agitation With Leakage Of Konam Project Gates Anakapalli District : వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఐదేళ్ల రివర్స్ పాలన పాపాలు రాష్ట్ర ప్రజలకు శాపాలుగా మారి నేడు వేధిస్తున్నాయి. జగన్ హయాంలో సాగునీటి రంగాన్ని పూర్తిగా పక్కన పెట్టడంతో పలు ప్రాజెక్టుల నిర్వహణ కుంటుపడింది. అనకాపల్లి జిల్లాలోని కోనాం రిజర్వాయర్ నిర్వహణకు కనీస నిధులు కేటాయించకపోవడంతో గేట్లు మరమ్మతులకు గురయ్యాయి. లీకేజీలు ఏర్పడి భారీగా నీరు దిగువకు వెళ్లిపోతున్నాయి.
మాడుగుల నియోజరకవర్గంలో చీడికాడ మండలం సమీపంలోనే ఈ కోనాం రిజర్వాయర్ కింద పది వేల ఎకరాలు సాగవుతుంది. మొత్తం ఆయకట్టు పద్నాలుగున్నర వేల ఎకరాలు ఈ రిజర్వాయర్‌పై ఆధారపడి ఉంటాయి. ఒక పంటకు పూర్తి స్థాయిలో నీరు అందాలంటే ఈ గేట్ల నిర్వహణ తప్పనిసరి. వీటిపై కూటమి ప్రత్యేక దృష్టి సారించి తమ సమస్యలను పరిష్కరించాలని రైతులు కోరుతన్నారు. వైఎస్సార్సీపీ ఒక్క పైసా విదల్చకుండా నేడు ఈ పరిస్థితి నెలకొందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కూర్మరాజు అందిస్తారు.