నకిలీ నోట్ల కలకలం- రూ.500 దొంగనోట్లతో మద్యం కొనుగోలు చేస్తూ పట్టుబడిన వైసీపీ కార్యకర్త - fake notes in govt liquor shop - FAKE NOTES IN GOVT LIQUOR SHOP

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 28, 2024, 10:50 PM IST

Fake Notes in Government Liquor Shop in Palnadu District : పల్నాడు జిల్లా యడ్లపాడు మండలంలోని ప్రభుత్వ మద్యం దుకాణంలోకి దొంగ నోట్లు రావడం తీవ్ర కలకలం రేపింది. మండలంలోని కారుచోల గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త షేక్ కాజా బుధవారం రాత్రి రూ .500 నోటు ఇచ్చి మద్యం కొనుగోలు చేశాడు. గురువారం ఉదయం నగదును బ్యాంకులో జమ చేసేందుకు మద్యం దుకాణం సిబ్బంది వెళ్లగా బ్యాంకు అధికారులు అది దొంగ నోటుగా తేల్చారు. ఒకటి దొంగ నోటు అని చెప్పడంతో మద్యం దుకాణం పర్యవేక్షకులు ఆందోళన చెందారు. 

ఈరోజు కూడా మద్యం కొనుగోలుకు చేసేందుకు మళ్లీ దొంగ నోట్లతో కాజా వచ్చాడు. దుకాణ సిబ్బంది అతడిని పట్టుకుని తనిఖీ చేయాగా మరో ఏడు 500 రూపాయల నకిలీ నోట్లు లభించాయి. దొంగ నోట్లతో పాటు వైఎస్సార్సీపీ కార్యకర్త కాజాను యడ్లపాడు పోలీసులకు మద్యం దుకాణం సిబ్బంది అప్పగించారు. దొంగనోట్ల మార్పిడి కోసం మరొక వ్యక్తి కూడా మద్యం దుకాణానికి వచ్చినట్లు సిబ్బంది తెలిపారు. నిందితులపై కేసు నమోదు కాకుండా వైసీపీ నేతలు పోలీసులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.