ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంలో చీలిక - సూర్యనారాయణ బహిష్కరణ - Expulsion of KR Suryanarayana - EXPULSION OF KR SURYANARAYANA
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 27, 2024, 5:44 PM IST
Expulsion of KR Suryanarayana from AP Employees Union: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంలో చీలిక ఏర్పడింది. అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణను సంఘం నుంచి బహిష్కరిస్తూ సంఘం ప్రధాన కార్యదర్శి ఆస్కార్‌రావు వర్గం తీర్మానం చేసింది. ఉద్యోగ సంఘం మాటున సూర్యనారాయణ ఉన్నతాధికారులను దుర్భాషలాడి, అందరిపై అహంకారంతో ప్రవర్తించారని ఆస్కార్‌రావు ఆరోపించారు. సూర్యనారాయణ ఇష్టారీతిన షోకాజ్ నోటీసులు ఇవ్వడం, రాజీనామాలు చేయించడం లాంటివి చేసేవారన్నారు. ఆయన ప్రవర్తన వల్ల తమ సంఘం అనేక కేసులను ఎదుర్కొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యవర్గ సమావేశంలో అప్రజాస్వామికంగా తనను బయటకు పంపి తీవ్రంగా అవమానించారని ఆస్కార్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. నచ్చిన వారికి ఒకలాగా, నచ్చని వారికి మరోలా సూర్యనారాయణ ప్రవర్తించేవారని గుర్తు చేశారు. కార్యవర్గ సమావేశంలో అప్రజాస్వామికంగా తనను బయటికి పంపారని, ఒక దళిత ఉద్యోగి అయిన తనను తీవ్రంగా అవమానించారని ఆయన ఆరోపించారు. సూర్యనారాయణను, గుళ్ల నాగసాయిని సంఘం నుంచి బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నూతన అధ్యక్షుడిగా డి. శ్రీకాంత్‌ను నియమిస్తున్నట్లు ఆస్కార్ రావు తెలిపారు.