చిరస్థాయిలో నిలిచేలా ఉరవకొండ అభివృద్ధి- ఐదోసారి విజయంపై పయ్యావుల కేశవ్ ధీమా - TDP MLA Payyavula Keshav - TDP MLA PAYYAVULA KESHAV
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 5, 2024, 5:18 PM IST
Uravakonda TDP MLA Payyavula Keshav: వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రాభివృద్ధి కుంటుపడిందని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు. ఉరవకొండలో ఎక్కడా చూసిన తాను చేసిన అభివృద్ధే కనిపిస్తుందని అన్నారు. అందుకే ఉరవకొండ ప్రజలు తనను నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని వివరించారు. తన పేరు చిరస్థాయిగా ఉండేలా ఉరవకొండను అభివృద్ధి చేశానని కేశవ్ చెప్పారు. 2014లో గెలిచిన వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి ప్రజలకు ఏమి చేశారో ఒక్కటైనా చెప్పాలని సవాల్ విసిరారు. 1994 పరిస్థితులు మళ్లీ కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.
ప్రజలకు సంబధించిన తాగు, సాగు నీరు, రైతు సమస్యలు, ప్రభుత్వ అక్రమాలపై శాసన సభలో మాట్లాడినట్లు తెలిపారు. మెగా డ్రిప్ పథకాన్ని, సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన అనంతంర రద్దు చేశాడని, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచిన అనంతరం మెగా డ్రిప్ పథకాన్ని మళ్లీ పునరుద్ధరిస్తామని తెలిపారు. ఉరవకొండలో స్కూల్స్, కాలేజీల నిర్మాణానికి ఎంతో కృషి చేసినట్లు తెలిపారు. తనను ఐదోసారి ఎమ్మెల్యేగా గెలిపించటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారంటున్న ఉరవకొండ కూటమి అభ్యర్థి పయ్యావుల కేశవ్ తో మా ప్రతినిధి ముఖాముఖి.