పాస్ పోర్టు రెన్యువల్ చేయించిన వైఎస్ జగన్ - YS JAGAN AT PASSPORT OFFICE - YS JAGAN AT PASSPORT OFFICE
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01-08-2024/640-480-22106189-thumbnail-16x9-ys-jagan-at-passport-office.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 1, 2024, 10:47 PM IST
Ex CM YS JAGAN Mohan Reddy AT PASSPORT OFFICE: మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాస్ పోర్టు కార్యాలయానికి వచ్చారు. పాస్ పోర్టును రెన్యువల్ చేసుకోవడం కోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయన సతీమణి భారతితో కలసి విజయవాడలోని రీజినల్ పాస్ పోర్టు కార్యాలయానికి వచ్చారు. ఇద్దరూ వారి పాస్ పోర్టు రెన్యువల్‌కు సంబంధించి డాక్యుమెంట్లను, ఆధారాలను సమర్పించడం సహా వేలి ముద్రలు వేసి, ఐరీష్ పూర్తి చేశారు.
అయితే ఈ పాస్ పోర్టు రెన్యువల్ ప్రక్రియను మొత్తం కేవలం 20 నిముషాల వ్యవధిలో అధికారులు పూర్తి చేశారు. మరోవైపు జగన్ మోహన్ రెడ్డికి భద్రత కోసం ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ప్రభుత్వం కేటాయించింది. అయితే కాన్వాయ్‌లో బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఉన్నా ఆయన దాన్ని వినియోగించుకోవడం లేదు. తమ వ్యక్తిగత వాహనంలోనే జగన్ దంపతులు ఇద్దరూ పాస్ పోర్టు కార్యాలయానికి వచ్చి వెళ్లారు.