thumbnail

LIVE : తెలంగాణ బడ్జెట్‌పై ఈటీవీ భారత్ చర్చా కార్యక్రమం - LIVE DEBATE ON TELANGANA BUDGET

By ETV Bharat Telangana Team

Published : Jul 25, 2024, 1:59 PM IST

Updated : Jul 25, 2024, 3:03 PM IST

Debate on Telangana Budget Allocations : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25కు పూర్తిస్థాయి బడ్జెట్​ను రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ, మండలిలో ప్రవేశపెట్టింది. లోక్​సభ ఎన్నికలకు ముందు నాలుగు నెలల కాలానికి ఓటాన్​ అకౌంట్​ బడ్జెట్​ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇప్పుడు రూ.2,91,159 కోట్లతో పూర్తిస్థాయి వద్దును ప్రవేశపెట్టింది. ప్రభుత్వం ఆరు గ్యారంటీలు, సంక్షేమం, అభివృద్ధికి బడ్జెట్​లో నిధులు అధిక మొత్తంలో కేటాయింపులు చేసింది. ఈ పద్దులో వ్యవసాయ శాఖకు పెద్దపీట వేసింది. రెండు రోజుల క్రితం కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్​లో తెలంగాణకు కేటాయింపులు అనేవి ఆశించిన స్థాయిలో రాలేదు. కేంద్రం నుంచి రాష్ట్రానికి పెద్దగా ఏమీ దక్కకపోవడంతో రాష్ట్ర సొంత ఆదాయం, ఇతర మార్గాల పైనే ప్రభుత్వం ఎక్కువగా ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రవేశపెట్టిన పద్దులో కేటాయింపులు సరిగ్గానే ఉన్నాయా? ఇంకా కేటాయించాల్సినవి ఏమైనా ఉన్నాయా? ఏ రంగానికి లాభం చేకూరనుంది? ఏ రంగానికి అన్యాయం జరిగింది వంటి అంశాలపై ఈటీవీ భారత్ ప్రత్యేక చర్చా కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం మీకోసం.
Last Updated : Jul 25, 2024, 3:03 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.