LIVE : తెలంగాణ బడ్జెట్​పై ఈటీవీ భారత్​ చర్చా కార్యక్రమం - TELANGANA BUDGET DEBATE LIVE 2024 - TELANGANA BUDGET DEBATE LIVE 2024

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jul 25, 2024, 11:09 AM IST

Updated : Jul 25, 2024, 12:00 PM IST

Debate on Telangana Budget Allocations : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25కు పూర్తిస్థాయి బడ్జెట్​ను రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ, మండలిలో ప్రవేశపెట్టనుంది. లోక్​సభ ఎన్నికలకు ముందు నాలుగు నెలల కాలానికి ఓటాన్​ అకౌంట్​ బడ్జెట్​ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇప్పుడు పూర్తిస్థాయి వద్దును ప్రవేశపెడుతుంది. ప్రభుత్వం ఆరు గ్యారంటీలు, సంక్షేమం, అభివృద్ధికి బడ్జెట్​లో నిధులు అధిక మొత్తంలో కేటాయింపులు చేయనుంది. రెండు రోజుల క్రితం కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్​లో తెలంగాణకు కేటాయింపులు అనేవి ఆశించిన స్థాయిలో రాలేదు. కేంద్రం నుంచి రాష్ట్రానికి పెద్దగా ఏమీ దక్కకపోవడంతో రాష్ట్ర సొంత ఆదాయం, ఇతర మార్గాల పైనే ప్రభుత్వం ఎక్కువగా ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓటాన్​ అకౌంట్​ పద్దు రూ.2.75 లక్షల కోట్లు, ఇప్పుడు దానికంటే పూర్తిస్థాయి బడ్జెట్​ను దాదాపు రూ.2.90 లక్షల కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రవేశపెట్టనున్న బడ్జెట్, ఏయే శాఖకు కేటాయింపులు ఎలా ఉండనున్నాయి? ఏయే రంగాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది? వంటి వాటిపై ఆర్థిక నిపుణులతో ఈటీవీ భారత్ చర్చా కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం మీకోసం.
Last Updated : Jul 25, 2024, 12:00 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.