రాజధాని అమరావతిని రెండున్నరేళ్లలో పూర్తి చేస్తాం: మంత్రి నారాయణ - narayana interview on Amaravati
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 15, 2024, 2:03 PM IST
Minister Narayana Interview About Capital Amaravati : రాజధాని అమరావతి నిర్మాణం మరో రెండున్నరేళ్లలో పూర్తి చేసి తీరుతామని పురపాలకశాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతుల త్యాగాలు గొప్పవని వారికి తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం అమరావతి పరిస్థితిని అధ్యయనం చేయడానికి ఓ కమిటీని వేస్తామని, ఆ నివేదిక రావడానికి రెండు, మూడు నెలలు పడుతుందని తెలిపారు. రాజధాని పరిధిలోని ప్రతి గ్రామంతో తనకు అనుబంధం ఉందని తెలిపారు. 34 వేల ఎకరాల్ని కేవలం 58 రోజుల్లో రాజధాని నిర్మాణానికి రైతులు ఇచ్చారని, రూ.9వేల కోట్లు ఖర్చుపెట్టి రహదారుల నిర్మాణం తదితర మౌలిక వసతులు కల్పించామని గుర్తు చేశారు.
ఐఏఎస్‌లు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, నాలుగో తరగతి ఉద్యోగుల వసతి భవనాలు గత టీడీపీ ప్రభుత్వంలోనే 70-90% పూర్తయ్యాయని నారాయణ తెలిపారు. అభివృద్ధి పనుల్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొనసాగిస్తే అమరావతి పూర్తయ్యేదని అన్నారు. రీ టెండర్లు పిలవడమా ఉన్నవారిని కొనసాగించడమా అనే దాని గురించి ఆలోచిస్తున్నామని తెలిపారు. ఆరేడు నెలల్లో వసతి భవనాల్ని పూర్తి చేస్తామని, అమరావతి పనుల ప్రారంభంపై పదిరోజుల్లో స్పష్టత రానుందని నారాయణ తెలిపారు. జగన్ ప్రభుత్వం విధించిన చెత్త పన్ను నుంచి ప్రజలకు విముక్తి కలిగించేలా తన శాఖ పని తీరు ఉంటుందంటున్న మంత్రి పొంగూరు నారాయణతో ఈటీవి ప్రత్యేక ముఖా ముఖి ఇప్పుడు చూదాం.