శ్రీరామనవమి వేడుకల్లో అపశ్రుతి - విద్యుత్​ తీగలు తగిలి ఓ వ్యక్తి మృతి - Electric Shock - ELECTRIC SHOCK

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 18, 2024, 1:54 PM IST

Electric Shock in Sri Rama Procession in YSR District : వైఎస్సార్​ జిల్లాలో శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది.  వేంపల్లి మండలం రామిరెడ్డి పల్లెలో గురువారం తెల్లవారుజామున 5 గంటలకు గ్రామంలో స్వామి వారి ఊరేగింపులో విద్యుత్​ తీగలు తగిలి ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో 8 మందికి గాయాలయ్యాయి. ఇనుముతో చేసిన హనుమంతుడి విగ్రహానికి పైన ఉన్న విద్యుత్​ తీగలు తగలడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో పుల్లయ్య గారి చంద్ర ఓబుల్​ రెడ్డి మృతి చెందారు.

ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు పులివెందులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారిని మాజీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్​ సతీష్​ రెడ్డి పరామర్శించారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మృతి చెందిన చంద్ర ఓబుల్​ రెడ్డిని పోస్టుమార్టం నిమిత్తం పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పండగపూట గ్రామంలో విషాదం జరగడంతో రామిరెడ్డి పల్లెలో విషాదఛాయలు నెలకొన్నాయి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.