ఎన్నికల ఏర్పాట్లపై సీఈసీ నిఘా- రాష్ట్రంలో పరిస్థితులపై ప్రత్యేక పరిశీలకులు - EC Appointed Special Police - EC APPOINTED SPECIAL POLICE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 9, 2024, 1:38 PM IST

Election Commission Appointed Special Police Inspector  for Andhra Pradesh : ఎన్నికల కమిషన్ నియమించిన ప్రత్యేక పోలీసు పరిశీలకుడు దీపక్ మిశ్రా రాష్ట్రానికి వచ్చారు. గన్నవరం విమానాశ్రయం చేరుకున్న దీపక్ మిశ్రాకు కృష్ణా జిల్లా కలెక్టర్ (Collector) డీకే బాలాజీ, ఎస్పీ అద్నాన్ నయీమ్ ఆజ్మీ స్వాగతం పలికారు. రేపటి నుంచి ఆయన రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి శాంతి భద్రతలు, పోలింగ్ కేంద్రాల వద్ద సాయుధ బలగాల వినియోగం, సున్నిత, అతి సున్నిత ప్రాంతాల్లో పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించి ఈసీ (EC) కి నివేదించనున్నారు.

Deepak Mishra In to State : నేరుగా సీఈసీ (Chief Election Commissioner) కే రిపోర్టు చేసేలా రాష్ట్రానికి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను ఈసీ పంపింది. ఇప్పటికే ఇద్దరు పరిశీలకులు రామ్మోహన్ మిశ్రా, నీనా నిగమ్​ రాష్ట్రంలో పర్యటించి ఎన్నికల (Elections) ఏర్పాట్లు, వ్యయ పరిశీలనలపై నివేదికలు పంపుతున్నట్టు తెలుస్తోంది. ఎన్నికలు పారదర్శకంగా జరగడానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెప్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.