నీలారెడ్డిపల్లిలో బండారు శ్రావణి ప్రచారం - జోరు పెంచిన టీడీపీ నేతలు - tdp candidate bandaru sravani

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 20, 2024, 1:43 PM IST

Election Campaign Conducted By Bandaru Sravani at Neela Reddy Palli: ఎన్నికల షెడ్యూల్‌ వెలువడటంతో తెలుగుదేశం అభ్యర్థులు ఎన్నికల ప్రచార జోరు పెంచారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం నీలారెడ్డిపల్లి గ్రామంలో టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణి ఈరోజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ పథకాలే (Super Six schemes) వచ్చే ఎన్నికల్లో టీడీపీను అధికారంలోకి తీసుకువస్తాయని శ్రావణి ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీయే (NDA) నేతలతో కలిసి ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేసి కూటమిని గెలిపించాలని అభ్యర్థించినట్టు శ్రావణి శ్రీ పేర్కొన్నారు. ఐదేళ్ల పాలనలో వైఎస్సార్సీపీ ప్రజా ప్రతినిధులు నియోజకవర్గ సమస్యల్ని పట్టించుకున్న పాపాన పోలేదని దుయ్యబట్టారు.

నీలారెడ్డిపల్లి గ్రామంలో సూపర్ సిక్స్ పథకాలను విస్తృత స్థాయిగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ముందుకు వచ్చామని శ్రావణి శ్రీ పేర్కొన్నారు. గ్రామంలో ప్రధానంగా కరెంటు సమస్యలు, నీటి సమస్యలు ఎక్కువుగా ఉందని ప్రజలు తెలిపారన్నారు. సమస్యలపై ఎప్పటికప్పుడు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని గ్రామస్థులు వెల్లడించారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తేనే మా భవిష్యత్తు బాగుంటుందని ప్రజల ఆశాభావం వ్యక్తం చేస్తున్నారని శ్రావణి స్పష్టం చేశారు. జరగబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పాటు కోసం సింగనమల నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని ప్రజల ముందుకొస్తున్నారని శ్రావణి తెలియజేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.