LIVE : అస్తమించిన అసామాన్యుడు - రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత - RAMOJI RAO passed away - RAMOJI RAO PASSED AWAY
🎬 Watch Now: Feature Video
Published : Jun 8, 2024, 7:08 AM IST
|Updated : Jun 8, 2024, 10:44 PM IST
Eenadu Group Of Chairman Ramoji Rao PASSED AWAY : ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూశారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. పెదపారుపూడిలో రామోజీరావు అటు కోవెల గంటల సవ్వడి, దైవ స్తోత్రాలు. ఇటు పక్షుల రెపరెపల గానాలు. మరోదిశగా పచ్చటి పంటచేలు, చెరువు ఒడ్డు. రామోజీ ప్రకృతి ప్రేమకు, కళాత్మక ఆలోచనలకు పల్లె కాన్వాసుగా నిలిచింది. చిత్రకారుడు కావటానికి నేపథ్యమైంది. భవిష్యత్ దర్శనం చేసింది. ప్రాథమిక విద్యపూర్తయ్యాక పైచదువులకు రామోజీ గుడివాడ వెళ్లారు.రామోజీకి చదువు కంటే, కళలు, రాజకీయాలపై ఆసక్తి మిన్న. మాటల్లో నిశిత దృష్టి, సునిశిత పరిశీలన కనపడేది. గుడివాడ బజారులో నడిచి వెళ్తుంటే వరుసగా ఒకే వ్యాపార దుకాణాలు కనపడేవి. స్టీల్ సామాన్ల కొట్లయినా, ఫ్యాన్సీ షాపులైనా ఏవైనా వరుసగా అవే వ్యాపారాలు. ఇదేమిటి? ఇలా అందరూ ఒకే వ్యాపారం చేసే బదులు వేర్వేరు వ్యాపారాల్లో రాణించి లాభపడవచ్చు కదా? అని మిత్రులతో అనేవారు. అనుకరణలు వద్దని, సొంత ఒరవడే శ్రేయస్కరమని చెప్పేవారు. ఇందుకే కావచ్చు రామోజీరావు ప్రారంభించిన ప్రతి వ్యాపారంలో ఓ నవ్యత, వైవిధ్యం కనపడతాయి.
Last Updated : Jun 8, 2024, 10:44 PM IST