ఏప్రిల్ 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు - summer Holidays
🎬 Watch Now: Feature Video
Education Department Announced Summer Holidays for Schools : 2024-25 సంవత్సరానికి సంబంధించిన వేసవి సెలవులను ప్రకటిస్తూ పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకూ ఏప్రిల్ 24 నుంచి సెలవులు ప్రకటించారు. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకూ దాదాపు 49 రోజుల పాటు పాఠశాలకు సెలవులు ప్రకటిస్తూ విద్యా శాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఉత్తర్వులు ఇచ్చారు.
జూన్ 12వ తేదీన పాఠశాలలు పునః ప్రారంభం అవుతాయని విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా చర్యలు చేపట్టాల్సిందిగా జిల్లా విద్యాశాఖ అధికారులకు సర్క్యులర్‌ను పంపారు. కమిషనర్ ఆదేశాలకు విరుద్ధంగా ప్రైవేటు పాఠశాలలు నడిపితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. విద్యా శాఖ వేసవి సెలవులను (summer Holidays) ప్రకటించడంతో విద్యార్థుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.