కూటమి నేతలపై తప్పుడు కేసులు పెట్టడమే వైసీపీ దురాలోచన: సీఎం రమేశ్​ - 41A NOTICES TO CM RAMESH - 41A NOTICES TO CM RAMESH

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 8, 2024, 6:52 PM IST

DSP Issued Notice to BJP Leader CM Ramesh : అనకాపల్లి జిల్లా చోడవరం పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ అప్పలరాజు ముందు అనకాపల్లి లోక్‌సభ ఎన్డీయే అభ్యర్థి సీఎం రమేశ్‌, చోడవరం అసెంబ్లీ అభ్యర్థి కెఎస్‌ఎన్‌ఎస్‌ రాజు హాజరయ్యారు. ఈ నెల 4వ తేదీన చోడవరం మండలం గాంధీ గ్రామంలో టైల్స్ దుకాణంలో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు (DRI Officers) తనిఖీలు చేశారు. తమ విధులకు ఆటంకం కలిగించారని ‍అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సోమేష్‌ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు డీఎస్పీ అప్పలరాజు ఇటీవల సీఎం రమేశ్​, కెఎస్‌ఎన్‌ఎస్‌ రాజుకు 41ఎ నోటీసులు ఇచ్చారు. 

ఈ మేరకు సీఎం రమేశ్​, రాజు విచారణ అధికారి ముందు హాజరై వాంగ్మూలం ఇచ్చారు. ఎన్నికలు ఉన్న తరుణంలో రెవెన్యూ ఇంటెలిజెన్స్​ అధికారులను జీఎస్టీ అధికారులుగా చెప్పి అందరినీ నమ్మించారని ఆయన తెలిపారు. వారిని తొలగించాలని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినట్లు రమేశ్​​ పేర్కొన్నారు. తాము అధికారులను బెదిరించి అక్కడ ఉన్న ఆధారాలను తారుమారు చేసినట్లు దొంగ కేసు పెట్టారని ఆయన ఆరోపించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.