ఆర్టీసీ బస్సులో మందుబాబు వీరంగం- ప్రయాణికులు ఏంచేశారంటే! - drunken man attacked conductor - DRUNKEN MAN ATTACKED CONDUCTOR
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 23, 2024, 10:06 AM IST
Drunken Man Attacked Bus Conductor: అన్నమయ్య జిల్లాలో ఓ మందుబాబుకి ఆర్టీసీ బస్సులోని ప్రయాణికులు దేహశుద్ధి చేశారు. కడప నుంచి రాజంపేటకు వెళ్తున్న ఆర్టీసీ పల్లెవెలుగు బస్సులో ఓ మందుబాబు వీరంగం సృష్టించాడు. చెన్నరాయుడు అనే వ్యక్తి తన స్నేహితునితో కలిసి మద్యం సేవించి కడప నుంచి రాజంపేటకు వెళ్తున్న బస్సులో వైఎస్సార్ సర్కిల్ వద్ద ఎక్కి, మంటపంపల్లికి టికెట్టు తీసుకున్నాడు. అయితే మంటపంపల్లి బస్టాండ్ వద్దకు బస్సు రాగానే చెన్నరాయుడు దిగకపోవడంతో కండక్టర్ బస్సు దిగమని కోరాడు. మద్యం మత్తులో ఉన్న చెన్నరాయుడు బస్సు దిగకుండా కండక్టర్‌తో వాగ్వాదానికి దిగాడు.
కనీసం టికెట్ అయినా తీసుకోమని కండక్టర్ చిన్నరాయుడుతో అనగా కండక్టర్‌పై దాడికి దిగాడు. ఇదేమని ప్రశ్నించిన తోటి ప్రయాణికులపై కూడా మద్యం మత్తులో ఉన్న చెన్నరాయుడు పాదరక్షతో దాడి చేసి దురుసుగా ప్రవర్తించాడు. దీంతో తోటి ప్రయాణికులు అందరూ చిన్నరాయుడికి దేహశుద్ధి చేసి, బస్సు నందలూరులోకి లాగానే పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఈ విషయంపై నందలూరు పోలీసులు కేసు నమోదు చేశారు.