పోలీసు అధికారుల సంఘం డిమాండ్లపై దృష్టి సారించండి: డీజీపీ - పోలీసు సంఘం డిమాండ్లపై డీజీపీ లేఖ

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 24, 2024, 10:16 AM IST

DGP Rajendhra Nadh Reddy Letter To Home Secretary: హోంశాఖ కార్యదర్శికి డీజీపీ (DGP) రాజేంద్రనాథ్ రెడ్డి లేఖ రాశారు. రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం డిమాండ్ల జాబితా మొత్తం ఏడు పేజీల లేఖను (7 Pages Letter) హోంశాఖ కార్యదర్శికి డీజీపీ పంపారు. 13 డిమాండ్లను (Demands) నెరవేర్చే అంశంపై దృష్టి సారించాలని డీజీపీ కోరారు.

DGP Letter About Demands Of State Police Officers Association: ఇంధన శాఖతో సమానంగా పోలీసు విభాగానికీ స్పెషల్ పే రివిజన్ (Special Pay Revision) ప్రకటించాలని డీజీపీ సూచించారు. డిప్యూటీ తహశీల్దార్ల హోదాతో సమానంగా ఎస్సైలకు గెజిట్ ర్యాంక్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. హెడ్ కానిస్టేబుళ్ల కేడర్​లో వివిధ పీఆర్సీల్లో (PRC) ఉన్న అసమానతలను తొలగించాలని కోరారు. కిట్, మోటార్ సైకిల్, రిస్క్ అలవెన్సులను (Allowance) పెంచాలని డీజీపీ లేఖలో తెలిపారు. గ్రేహౌండ్స్​తో సమానంగా ఎపీఎస్పీ కానిస్టేబుళ్లకు  (APSP Constable) రేషన్ అలవెన్స్ ఇవ్వాలని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.