LIVE : అలిపిరి నుంచి తిరుమలకు పవన్‌కల్యాణ్ కాలి నడక - ప్రత్యక్ష ప్రసారం - Deputy Chief Minister Pawan Kalyan - DEPUTY CHIEF MINISTER PAWAN KALYAN
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 1, 2024, 5:03 PM IST
Deputy Chief Minister Pawan Kalyan in Tirumala LIVE : ప్రాయశ్చిత్త దీక్ష విరమించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తిరుమల చేరుకున్నారు. పద్మావతి అతిథి గృహంలో కాసేపు విశ్రాంతి తీసుకున్న పవన్ కల్యాణ్ తిరుమల బయల్దేరారు. అలిపిరి నుంచి కాలి నడకన తిరుమల కొండ ఎక్కుతున్నారు. అలిపిరి కాలినడక మార్గంలో అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అలిపిరి పాదాల వద్దకు పెద్ద సంఖ్యలో జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు చేరుకున్నారు.లడ్డూ నెయ్యి కల్తీ కాలేదని సుప్రీంకోర్టు చెప్పలేదని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. కేవలం తేదీ విషయంలోనే వివాదం ఉందన్నారు. నేడు తిరుమల చేరుకున్న పవన్ రెండో తేదీ ఉదయం శ్రీవారిని దర్శించుకుని ప్రాయశ్చిత్త దీక్ష విరమిస్తారు. అనంతరం అన్నప్రసాద కేంద్రాన్ని పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతిలో జరిగే వారాహి బహిరంగసభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సందర్బంగా కాలి నడకన తిరుమల కొండ ఎక్కుతున్న ఉపముఖ్యమంత్రి ప్రత్యక్ష ప్రసారం మీకోసం.