నీరు లేక మూగ జీవులు విలవిల- దాహం తీర్చుకోవడానికి జింక పరుగులు - Deer into Village for Water - DEER INTO VILLAGE FOR WATER
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 31, 2024, 5:12 PM IST
Deer into Village for Water in Prakasam District : ఒక జింక పరుగెత్తుకుంటూ వచ్చి ఓ గుంతలో చిక్కుకుంది. ఇంకే ఏ పులి తరుముతుందే సేఫ్ దాక్కుంది అనుకుంటున్నారా? వాస్తవానికి ఆ పరిస్థితి అలా ఉన్నా జింక గుంతలో చిక్కుకుని మరింత ఇబ్బంది పడింది. ఇంతలో ఓ మంచం నీడ పడి కాస్త విశ్రాంతి తీసుకుంది. కానీ దాని బాధ చెప్పలేని నిస్సహాయత దానిది. ఇంతకీ జింకకి ఎం కావాలో తెలుసా? గొంతు తడుపుకోడానికి నీరు. అడవిలో నీరు లేక జన జీవనంలోకి పరుగులు తీసింది తన దాహం తీర్చుకోడానికే. ఇటీవలే నీరు లేక చిరుత మరణించిన ఘటన అనంతపురం జిల్లాలో జరిగిన విషయం విధితమే.
No Water for Animals : ప్రకాశం జిల్లా త్రిపురాంతకం అంబేద్కర్ నగర్లోని ఓ ఇంటి వద్ద తీసిన గుంతలో జింక చిక్కుకుంది. ఇంటి యజమాని చూసి జింకకు ఎండ తగలకుండా మంచం అడ్డుపెట్టి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది జింకను క్షేమంగా బయటకు తీసి అటవీ ప్రాంతంలో వదిలి పెట్టారు. జింక నీళ్ల కోసం దారితప్పి వచ్చినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.