ప్రచారంలో పాల్గొన్న సీడబ్ల్యూసీ ఛైర్‌పర్సన్- సమగ్ర విచారణకు ఆదేశాలు - cwc chairperson code violation - CWC CHAIRPERSON CODE VIOLATION
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09-04-2024/640-480-21181199-thumbnail-16x9-ec-notices-to-cwc-chairman-violation-of-election-code.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 9, 2024, 12:21 PM IST
Cwc Chairman Violation of Election Code: ప్రభుత్వంలో నామినేటెడ్ పదవిలో ఉంటూ వైఎస్సార్సీపీ అభ్యర్థి తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బాలల పరిరక్షణా సమితి (సీడబ్ల్యూసీ) ఛైర్‌పర్సన్ మేడా రామలక్ష్మి నిబంధనలు ఉల్లంఘించారని జువెనైల్ విభాగం డైరెక్టర్ (Director Juvenile Department) ప్రసాదమూర్తి ఆ శాఖ కార్యదర్శికి నివేదిక పంపించారు. ఆమెను వెంటనే సస్పెండ్ చేసి సమగ్ర విచారణకు ఆదేశించాలని నివేదికలో పేర్కొన్నారు. రామలక్ష్మిపై కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి వినోద్ కుమార్ గుట్టుగా విచారణ చేయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఎన్నికల సంఘానికి లోబడే నిర్ణయం తీసుకోవాలన్న ఉద్దేశంతో మొత్తం వ్యవహారాన్ని అనంతపురం జిల్లా కలెక్టరు సిఫార్సు చేసినట్లు తెలిసింది. సస్పెండ్ చేస్తారా లేక విచారణ తర్వాత చర్య తీసుకుంటారా? అన్న విషయం తెలియాల్సి ఉంది. జువెనైల్ చట్టం ప్రకారం న్యాయపరమైన నిర్ణయాలు తీసుకునే సీడబ్ల్యూసీ ఛైర్‌పర్సన్ (CWC Chair Person) హోదా వ్యక్తులు రాజకీయ పార్టీల తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనరాదని నివేదికలో పేర్కొన్నారు.