రేపు ఉదయం 6 గంటలకే పెన్షన్లు పంపిణీ - జిల్లా కలెక్టర్లు పాల్గొనాలని సీఎస్ ఆదేశాలు - CS Nirab Kumar Prasad Review
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 31, 2024, 7:59 AM IST
CS Nirab Kumar Prasad Review on Pension Distribution in AP : ఆగస్టు 1వ తేదీ ఉదయం 6 గంటలకే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. ఆగస్టు నెలకు 64.82 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ కోసం రూ. 2,737 కోట్లు విడుదల చేశామని చెప్పారు. ఆగస్టు 1వ తేదీనే 96 శాతం, 2వ తేదీతో 100 శాతం పెన్షన్లు పంపిణీ పూర్తి చేయాలని సూచించారు.
Pension Distribution in AP : ఈ సారి పెన్షన్లు పంపిణీలో జిల్లా కలెక్టర్లు పాల్గొనాలని నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. సీఎస్ ఆదేశాలు అనుగుణంగా పెన్షన్లు పంపిణీకి అధికారులు సిద్ధమవుతున్నారు. పెన్షన్లు పంపిణీ ఎవరైనా అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎస్ సృష్టం చేశారు. గత నెలలో పెన్షన్లు పంపిణీ ఏర్పడిన సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.