వామ్మో!! మొసలి - భయాందోళనలో వాహనదారులు, స్థానికులు - Crocadile Halchal in Palnadu - CROCADILE HALCHAL IN PALNADU
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 2, 2024, 11:31 AM IST
Crocadile Halchal at Pulichintala Project in Palnadu District : పల్నాడు జిల్లాలో ఓ మొసలి హల్చల్ చేసింది. బుధవారం తెల్లవారు జామున (అక్టోబర్ 2న) 4 గంటల సమయంలో దర్జాగా రోడ్డుపై మొసలి వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పులిచింతల ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ నుంచి వంతెన మీదకు వచ్చి మొసలి సంచరిస్తోంది. ప్రాజెక్ట్ సమీపంలో మొసలి సంచారంతో వాహన చోదకులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
Crocadile Halchal in Palnadu District : పులిచింతల ప్రాజెక్ట్ బ్రిడ్జిపై విద్యుత్ దీపాలు లేకపోవడంతో మొసలి యధేచ్ఛగా సంచరిస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే వాహన చోదకులు, నదిలో స్నానాలు చేసేందుకు వచ్చే స్థానికులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను విజ్ఞప్తి చేసుకున్నారు. అధికారులు వెంటనే స్పందించి మొసలిని బంధించాలని కోరుతున్నారు. మొసలిని బంధించే వరకు స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు. అంత వరకు వాహనదారులు, స్థానికులు అటువైపు వెళ్లవద్దని స్థానికులకు అధికారులు సూచించారు.