వేల కోట్ల అవినీతికి పాల్పడ్డ జగన్‌పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు?: ముప్పాళ్ల - Cpi Muppalla on Drugs Issue
🎬 Watch Now: Feature Video
CPI State Assistant Secretary Muppalla Nageswara Rao on Drugs Issue : దిల్లీ మద్యం కేసులో 100 కోట్ల అవినీతి చేశారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన ఈడీ అధికారులు సీఎం జగన్ రూ.43 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని సీబీఐ చెప్పినా కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సీపీఐ (CPI) రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న మద్యం కుంభకోణంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కేంద్ర మంత్రి అమిత్‌షాకు ఇచ్చిన నివేదికను వెంటనే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ (YSRCP) నేతలు అడ్డగోలుగా దోచుకుంటున్నా కేంద్రం చూసి చూడనట్లు ఎందుకు వ్యవహరిస్తోందని ప్రశ్నించారు.
లక్ష కోట్ల డ్రగ్స్ విశాఖలో దొరికాయంటే దీన్ని బట్టి అధికార పార్టీ వ్యవహారం కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి రాష్ట్రానికే కాకుండా దేశంలో పలు ప్రాంతాలకు ఎగుమతులు జరుగుతున్నాయని అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి కారకులైన ప్రతీ ఒక్కరిపై ఉక్కుపాదం మోపాలని ముప్పాళ్ల ధ్వజమెత్తారు.