విభజన జరిగి పదేళ్లైనా ఆస్తుల పంపకం కాలేదు- ఎలాంటి నిధులూ రాలేదు: రామకృష్ణ - cpi ramakrishna comments

🎬 Watch Now: Feature Video

thumbnail

CPI Ramakrishna on AP State Bifurcation Issues: రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు గడిచినా నేటికీ ఉమ్మడి ఆస్తుల పంపకం జరగలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ అన్నారు. జూన్ 2 వ తేదీతో రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలు పూర్తవుతుందని, హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పదేళ్ల గడువు పూర్తవుతుందని రామకృష్ణ అన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న ఏ ఒక్క అంశాన్ని నేటి వరకూ అమలు చేయలేదన్నారు. ఇప్పటికైనా తెలుగుదేశం, వైఎస్సార్సీపీ సహా అన్ని పార్టీలు రాష్ట్ర విభజన హామీలు అమలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు.

విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ పదేళ్లుగా కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎలాంటి నిధులు రాలేదని మండిపడ్డారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్య నుంచి తప్పించుకోవడానికే కేంద్రంలోని బీజేపీ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసిందన్నారు. విభజన చట్టంలోని అంశాలను అమలు చేసే వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.