ల్యాండ్​ టైటిలింగ్​ యాక్ట్​కు నేనూ బాధితుడినే: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ - NARAYANA ON LAND TITLING ACT - NARAYANA ON LAND TITLING ACT

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 10, 2024, 7:56 AM IST

CPI Leader Narayana Comment on Land Titling Act : సీఎం జగన్​ ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన ల్యాండ్​ టైటిలింగ్​ యాక్ట్​కు​ తాను బాధితుడినేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని ల్యాండ్​ టైటిలింగ్​ యాక్ట్​ గురించి ప్రస్తావించారు. ల్యాండ్​ టైటిలింగ్​ యాక్ట్​ ద్వారా భూమిని తనఖా పెట్టడానికి, ఎలాంటి హామీకి ఇది ఊపయోగపడదని పుస్తకం లోపల రాసి ఉంచారని నారాయణ తెలిపారు. రెవెన్యూ అధికారులను అడిగితే ప్రభుత్వం చెప్పింది చేశామని చెప్పారన్నారు. 

తెలంగాణలో ధరణి చట్టంతో కేసీఆర్ ఓటమి చెందారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏపీలో భూ హక్కు చట్టంతో జగన్ మోహన్​ రెడ్డి ఓటమి ఖాయమని వ్యాఖ్యానించారు. ల్యాండ్​ టైటిలింగ్​ యాక్ట్​ ద్వారా భూ హక్కు దారులకు జాయింట్​ పట్టా ఇచ్చారని ఆరోపించారు. రిజిస్ట్రేషన్‍ చేసుకున్న భూమి పత్రాలను ఇవ్వకుండా ఆయన పెట్టుకోవడం ఏంటని ప్రశ్నించారు. సీఎం జగన్​ ఓడిపోతే పుస్తకం మీద ఉన్న బొమ్మను ఏమి చేయాలని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.