అప్పుల బాధతో దంపతులు ఆత్మహత్యయత్నం - భర్త మృతి - Couple suicide attempt - COUPLE SUICIDE ATTEMPT

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 26, 2024, 8:06 PM IST

Couple Suicide Attempt Due to Debt : అప్పుల బాధ తాళలేక భార్యభర్తలు ఆత్మహత్యయత్నం చేసుకున్న విషాదకర ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో భర్త మృతి చెందగా భార్య ప్రాణాలలో బయటపడింది. వివరాల్లోకి వెళితే, గుంటూరు జిల్లా కొల్లిపల్లి మండలం తూములూరు గ్రామంలో చంద్రశేఖర్ (45), నాగలక్ష్మి (35) దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే సంవత్సరం క్రితం భర్త చంద్రశేఖర్​కు ప్రమాదవశత్తు యాక్సిడెంట్ అయ్యింది. భర్తను వివిధ ఆసుపత్రులో వైద్యం చేయించిన ఆరోగ్యం కుదుటపడలేదు. దీంతో భర్తకు మెరుగైన చికిత్స కోసం భార్య నాగలక్ష్మి కొంత అప్పుచేసింది.

Couple Tried to Commit Suicide : ఇచ్చిన గడువు దాటిపోవడంతో అప్పు ఇచ్చిన వ్యక్తి చెంటనే తన డబ్బు ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. దీంతో మనస్తాపానికి  గురైన దంపతులు ఇక చావే దిక్కని భావించి సోమవారం ఇంట్లోనే పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించారు. అపస్మారకస్థితిలో ఉన్న భార్యాభర్తలను గుర్తించిన కుటుంబసభ్యులు తెనాలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భర్త చంద్రశేఖర్ ఈరోజు మృతిచెందగా భార్య నాగలక్ష్మి చికిత్స పొందుతుంది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.