కార్పోరేటర్ భర్త కికాతకం - భూకబ్జా అడ్డుకున్నరని సీపీఐ నేతలపై దాడి - Attacks by YCP leaders
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 3, 2024, 9:37 PM IST
Corporator Husband Attacked CPI Leaders: రాష్ట్రంలో వైసీపీ నాయకులు, వారి అనుచరుల అరాచకాలకు హద్దే లేకుండా పోతోంది. ఖాళీ స్థలం కనిపిస్తే దానిని కబ్జా చేయడం, అడ్డుకున్న వారిపై అన్యాయంగా దాడులు చేయడం వంటి అరాచకాలు చేస్తున్నారు. తాజాగా స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నాన్ని అడ్డుకున్న వారిపై ఓ కార్పొరేటర్ భర్త దాడికి పాల్పడిన ఘటన గుంటూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్సే నగరపాలక సంస్థ పరిధిలోని 26వ డివిజన్ కార్పోరేటర్ భర్త బ్రహ్మారెడ్డి స్థానిక చండ్రరాజేశ్వరరావు నగర్‌లో కోర్టు కేసులో ఉన్న స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో అక్కడకు స్థలాన్ని కబ్జా చేయకుండా ఆపేందుకు వెళ్లిన సీపీఐ నాయకులపై ఆయన దాడికి పాల్పడ్డారు. వారిపై మారణాయుదాలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దాడిలో తీవ్రంగా గాయపడిన సీపీఐ నేతలు దేవానాయక్, వాసునాయక్లను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని సీపీఐ నగర కార్యదర్శి మాల్యాద్రి పరామర్శించారు.