కాంగ్రెస్ పార్టీ నుంచి దాఖలైన తొలి నామినేషన్ - రాయదుర్గంలో ఎన్నికల బరిలో నిలిచిన చిన్నప్పయ్య - congress party first NOMINATION - CONGRESS PARTY FIRST NOMINATION
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18-04-2024/640-480-21256012-thumbnail-16x9-congress-party-first-nomination-in-anantapur-district.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 18, 2024, 7:26 PM IST
Congress Party First Nomination in Anantapur District : అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తొలి నామినేషన్ దాఖలైంది. జిల్లాలోని రాయదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి చిన్నప్పయ్య ఈరోజు మెుదటి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి పదేళ్లు పూర్తయిన ఎటువంటి అభివృద్ధి జరగలేదని తెలిపారు. అధికారంలో ఉండి టీడీపీ, వైసీపీలు రాష్ట్రానికి చేసిందేమి లేదని విమర్శించారు. ఈ రెండు పార్టీల వల్ల అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేద కుటుంబంలోని మహిళకు ప్రతినెలా రూ. 8,330 అందించడంతో ఏడాదికి లక్ష రూపాయల మేర ఆర్థిక సహాయం లభిస్తుందన్నారు. అలాగే రాష్ట్రంలో రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని తెలిపారు. పేదలకు పక్కా గృహాలు నిర్మిస్తామని పేర్కొన్నారు. రాయదుర్గం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినట్లు తెలిపారు. ప్రస్తుతం మూడోసారి అదే పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశానని వెల్లడించారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.