కరువుతో అల్లాడుతున్న కడప జిల్లా రైతులకు పరిహారం చెల్లించాలి: తులసిరెడ్డి - Kadapa Drought Conditions

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 4, 2024, 3:54 PM IST

Congress Leader Tulasi Reddy on Kadapa Drought Conditions: కడప జిల్లాలో కరవు రక్కసి కరాళ నృత్యం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ మీడియా ఛైర్మన్‌ తులసిరెడ్డి అన్నారు. జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని ఖరీఫ్‌ సీజన్​లో రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. 7 వేల హెక్టార్ల పంట ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రైతులకు పరిహారం చెల్లించి ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ మీడియా ఛైర్మన్‌ తులసిరెడ్డి కోరారు.

"కడప జిల్లాలో కరవు రక్కసి కరాళ నృత్యం చేస్తోంది. జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఖరీఫ్ సీజన్​లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. జిల్లాలో సాగు చేసిన 17 వేల హెక్టార్లలో 7 వేల హెక్టార్లలో పంట ఇప్పటికే ఎండిపోయింది. మిగితా చోట్ల కూడా పంట ఎండిపోయేందుకు సిద్ధంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం రైతులకు పరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరుతున్నాను." - తులసిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మీడియా ఛైర్మన్‌

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.