జగన్ పర్యటనలో చెట్లు నరికివేత - సీఈవోకు ఫిర్యాదు - COMPLAINT ON TREES CUTTING CM TOUR - COMPLAINT ON TREES CUTTING CM TOUR
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 8, 2024, 8:46 PM IST
Complaint On Trees Cutting in CM Jagan Tour : ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ప్రచార కార్యక్రమం కోసం చెట్లను కొట్టివేయడాన్ని నిలువరించాలని మాజీ ఎమ్మెల్సీ రామకృష్ణ, గుంటూరు మిర్చియార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు ఈసీకి ఫిర్యాదు చేశారు. మేమంతా సిద్ధం ఎన్నికల ప్రచార సభకు వెళ్లిన చోటల్లా చెట్లను కొట్టేసి ప్రకృతి విధ్వంసం చేస్తున్నారని సీఈఓకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ పర్యటించే చోట్ల తక్షణం ఈ చెట్ల కొట్టివేతను నిలువరించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకు వినతిపత్రం ఇచ్చారు. జగన్ పర్యటనపై అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు.
చెట్లను నరికేయకుండా ఆదేశాలివ్వాలని ముఖేష్ కుమార్ మీనాకు వినతిపత్రం అందించారు. రోడ్డు పక్కన నీడనిచ్చే చెట్లను కొట్టేస్తూ పోలీసులు, మున్సిపల్ సిబ్బంది దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. చట్టాన్ని పరిరక్షించాల్సిన ముఖ్యమంత్రే చట్టవిరుద్ధంగా చెట్లను కొట్టివేయించటంపై నేతలు ఆక్షేపణ వ్యక్తం చేశారు. మరోవైపు చెట్లను కోట్టేయాల్సిందిగా ఆదేశించిన అధికారులతో పాటు ఉద్యోగులు, వైసీపీ నేతల నుంచి ప్రకృతి విధ్వంసం చేసినందుకు జరిమానాతో పాటు కొత్తవి నాటేందుకు అవసరమైన ఖర్చులు కూడా వసూలు చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు.