LIVE : స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి - Staff Nurses Appointment Live
🎬 Watch Now: Feature Video
Published : Jan 31, 2024, 4:06 PM IST
|Updated : Jan 31, 2024, 5:10 PM IST
CM Revanth Reddy Giving Appointment Documents to Staff Nurses : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టాఫ్ నర్సు పోస్టులకు ఎన్నికైన అభ్యర్థులకు నియామక పత్రాలను హైదరాబాద్లోని ఎల్పీ స్టేడియంలో అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎల్బీ స్టేడియాన్ని అందంగా అలంకరించారు. ప్రజా ఆరోగ్యమే ద్యేయంగా నూతనంగా నియమించబడిన 6956 స్టాఫ్ నర్సులు నియామక పత్రాలను ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అందజేస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను సంబంధిత అధికారులు పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 600 మంది సివిల్ పోలీసులు, ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురు కాకుండా మూడు వందల మంది ట్రాఫిక్ పోలీసులను ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్ నియామక ప్రక్రియ చేపట్టింది. గత సంవత్సరం డిసెంబర్ 18న కాంగ్రెస్ ప్రభుత్వం స్టాఫ్ నర్స్ ఫలితాలను విడుదల చేసింది. ప్రస్తుతం ఉద్యోగం పొందిన వారికి నియామక పత్రాలను అందజేస్తుంది.