LIVE : పాతబస్తీ మెట్రో రైలు ప్రాజెక్టుకు సీఎం రేవంత్ శంకుస్థాపన - Old City Metro Foundation Stone
🎬 Watch Now: Feature Video
Published : Mar 8, 2024, 6:08 PM IST
|Updated : Mar 8, 2024, 7:03 PM IST
CM Revanth Laid Foundation Stone for Old City Metro Rail Project : హైదరాబాద్ పాతబస్తీకి ఎట్టకేలకు మెట్రోరైలు సౌకర్యం కలగనుంది. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు మొత్తం 5.5 కిలోమీటర్ల పొడవునా ఈ రైలు మార్గాన్ని నిర్మించునున్నారు. దీనికి రూ.2,000 కోట్లు వ్యయం అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నిర్మాణం పూర్తయితే సికింద్రాబాద్ నుంచి జేబీఎస్, ఎంజీబీఎస్ మీదుగా పాతబస్తీకి ప్రయాణం చేయొచ్చు. మొదటి దశ ప్రాజెక్టును ఎల్ అండ్ టీ మెట్రోరైలు సంస్థ దాదాపు రూ.16 వేల కోట్లతో 69.2 కిమీ మేర నిర్మాణం చేపట్టింది. అప్పట్లోనే పాతబస్తీకి మెట్రో సౌకర్యం కల్పించడానికి ప్రయత్నాలు జరిగి సర్వే కూడా చేశారు. అయితే కొన్ని పార్టీలు స్థానికుల నుంచి నిరసన రావడంతో తాత్కాలికంగా నిలిపేశారు. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి మెట్రో విస్తరణపై ప్రధానంగా దృష్టి సారించారు. ముఖ్యంగా పాతబస్తీకి మెట్రో రైలు నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు పాతబస్తీ మెట్రోరైలుకు శంకుస్థాపన చేస్తున్నారు.
Last Updated : Mar 8, 2024, 7:03 PM IST