LIVE : మహబూబ్​నగర్​ ఎంపీ అభ్యర్థి వంశీచంద్​ రెడ్డి నామినేషన్ ర్యాలీలో సీఎం రేవంత్​ రెడ్డి - Lok Sabha nominations in telangana - LOK SABHA NOMINATIONS IN TELANGANA

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Apr 19, 2024, 12:42 PM IST

Updated : Apr 19, 2024, 2:11 PM IST

LIVE : సీఎం రేవంత్​ రెడ్డి మహబూబ్​నగర్​ లోక్​సభ నియోజకవర్గ అభ్యర్థి చల్లా వంశీచంద్​ రెడ్డి నామినేషన్​ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మెట్టుగడ్డ నుంచి సీఎం రేవంత్​ రెడ్డితో పాటు నియోజకవర్గ అభ్యర్థి చల్లా వంశీ సహా ఉమ్మడి పాలమూరుకు చెందిన ఎమ్మెల్యేలు కలెక్టరేట్​కు ర్యాలీగా వెళుతున్నారు. నామినేషన్లు పూర్తి అయిన అనంతరం గడియారం కూడలి వద్ద జరిగే కార్నర్​ మీటింగ్​లో సీఎం రేవంత్​ రెడ్డి పాల్గొననున్నారు.మహబూబ్​నగర్​లో చల్లా వంశీ నామినేషన్లు పూర్తి అయి కార్నర్​ మీటింగ్​ ముగిసిన అనంతరం మహబూబాబాద్​లోని ఎన్టీఆర్​ స్టేడియంలో నిర్వహించే జనజాతర సభలో సీఎం పాల్గొననున్నారు. ఈ సభకు దాదాపు లక్ష మంది వచ్చేలా ఏర్పాట్లను చేస్తున్నారు. ఈసారి తెలంగాణలో 15 లోక్​సభ స్థానాలను గెలిచి సోనియాగాంధీకి కానుకగా ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వం చూస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే కాంగ్రెస్​ తన ప్రచారాన్ని వేగవంతం చేసింది. ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళుతూ తమ ప్రభుత్వం వస్తే ఏం చేస్తుందో స్పష్టంగా కాంగ్రెస్​ వివరిస్తుంది.
Last Updated : Apr 19, 2024, 2:11 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.