వైసీపీ ఎన్నికల ప్రచారం - మార్చి 27 నుంచి జగన్ బస్సు యాత్ర
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 19, 2024, 8:17 PM IST
CM Jagan Bus Yatra From 27th March : ఈ నెల 27 (మార్చి) నుంచి వైసీపీ అధ్యక్షుడి హోదాలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బస్సుయాత్ర ద్వారా ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. ఈ యాత్ర ఇడుపులపాయ నుంచి ఉత్తరాంధ్ర వరకు కొనసాగనుంది. మెుదట 27వ తేదీన ఉదయం ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి అనంతరం బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. సిద్దం బహిరంగ సభలు జరిగిన ప్రాంతాలు మినహా మిగిలిన చోట ఈ యాత్ర నిర్వహించనున్నారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్నికల సభలు నిర్వహించాలని వైసీపీ నిర్ణయించింది.
మెుదటి రోజు బస్సుయాత్ర ద్వారా మధ్యాహ్నం 3 గంటలకు ప్రొద్దుటూరు చేరుకుని అక్కడ తొలి బహిరంగ సభ నిర్వహించనున్నారు. ప్రతి రోజూ ఉదయం 9.30 గంటలకు వివిధ వర్గాల ప్రజలతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహిస్తారు. సాయంత్రం 3 గంటలకు బహిరంగ సభ నిర్వహిస్తారు. ఈ నెల 28న నంద్యాలలో సీఎం వైఎస్ జగన్ ఎన్నికల బహిరంగ సభ నిర్వహిస్తారు. గుడ్ ఫ్రైడే కారణంగా ఈనెల 29న బహిరంగ సభ ఉండదు. అలాగే 30వ తేదీన ఎమ్మిగనూరులో సీఎం వైఎస్ జగన్ ఎన్నికల బహిరంగ సభ నిర్వహిస్తారు.