LIVE : ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేస్తున్న చంద్రబాబు - ప్రత్యక్ష ప్రసారం - CM Chandrababu Live - CM CHANDRABABU LIVE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 1, 2024, 2:33 PM IST
|Updated : Oct 1, 2024, 4:22 PM IST
CM Chandrababu To Handover NTR Pension To Beneficiaries in Kurnool : రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కొనసాగుతోంది. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పుచ్చకాయలమడలో సీఎం పర్యటించారు. పుచ్చకాయలమడలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు సీఎం నారా చంద్రబాబు నాయుడు అందజేశారు.కృష్ణా జిల్లా మొవ్వలో సచివాలయం సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం తాండలో అధికారులతో కలిసి టీడీపీ నేతలు పింఛన్లు అందించారు. కర్నూలు నిర్మల్ నగర్‌లో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి ఫింక్షన్లు ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందించారు. ఇచ్చిన మాట ప్రకారం హామీ లను నెరవేరుస్తున్నామని చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని ఎగువగడ్డ కాలనీలో 12, 13 వార్డుల్లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పింఛన్లు పంపిణీ చేశారు. ఉదయాన్నే ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేస్తున్న చంద్రబాబు - ప్రత్యక్ష ప్రసారం
Last Updated : Oct 1, 2024, 4:22 PM IST