LIVE: తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు - ప్రత్యక్షప్రసారం - Telugu Language Day program - TELUGU LANGUAGE DAY PROGRAM
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 29, 2024, 3:46 PM IST
|Updated : Aug 29, 2024, 7:47 PM IST
CM Chandrababu participated in Telugu Language Day program: దేశ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలకు తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. మన భాషాభివృద్దికి విశేష కృషి చేసిన మహనీయులను స్మరించుకుందామని చెప్పారు. అమ్మభాషకు సేవ చేసిన తెలుగు పెద్దలకు కృతజ్ఞతలు చెబుదామని పేర్కొన్నారు. వారి అడుగుజాడల్లో నడుస్తూ మన భాషను సుసంపన్నం చేసుకుందామని ఆకాంక్షించారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని ముందు తరాలకు అందించే బృహత్తర బాధ్యత తీసుకుందామన్నారు. అదే వారికి మనమిచ్చే ఘననివాళి అని తెలిపారు. తెలుగు వెలగాలి తెలుగు భాష వర్థిల్లాలి అని కోరుకుంటూ దాని కోసం పనిచేద్దామని చంద్రబాబు ట్వీట్ చేశారు. మాతృ భాషలో విద్యా విధానం సాగాలనే తలంపుతో వ్యవహారిక భాషోద్యమం చేసిన గిడుగు రామ్మూర్తి పంతులుకి తెలుగు ప్రజలంతా ఆజన్మాంతం రుణపడి ఉంటామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఆయన కృషి ఫలితంగా వ్యవహారిక భాషలో నేడు విద్యాభ్యాసం జరుగుతోందని చెప్పారు. మాతృభాష పరిరక్షణకు ఎన్డీయే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టంచేశారు. విజయవాడలో తెలుగు భాషా దినోత్సవం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ప్రత్యక్షప్రసారం.
Last Updated : Aug 29, 2024, 7:47 PM IST