వైరల్​ : సమయస్ఫూర్తికి సెల్యూట్- ముంచుకొచ్చిన ప్రమాదంపై సిబ్బందినీ అప్రమత్తం చేసిన చంద్రబాబు - CM Chandrababu Missed an Accident - CM CHANDRABABU MISSED AN ACCIDENT

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 6, 2024, 12:25 PM IST

CM Chandrababu Missed an Accident : వరద ప్రాంతాల పరిశీలనకు వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రైలు ప్రమాదం తప్పిన విషయం తెలిసిందే. ఈ ప్రమాద ఘటనపై వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రైలు వంతెన ర్యాంపుపై నిలబడిన చంద్రబాబు నాయుడు బుడమేరు వరద ప్రవాహం మ్యాపులు పరిశీలిస్తుండగా అకస్మాత్తుగా రైలు వచ్చింది. ఒక మనిషి నిలబడటానికి మాత్రమే అవకాశం ఉన్న ఈ వంతెనకు, రైలుకు మధ్య 3 అడుగుల దూరం మాత్రమే ఉంది. పొరపాటుగా కొంచెం అటు, ఇటు కదిలితే రైలు బలంగా ఢీకొనే ప్రమాదం ఉంది. కొంత దూరంలో రోడ్డుపై ఉన్నవారు రైలు వస్తోందంటూ గట్టిగా కేకలు వేశారు. ఇది గమనించిన ముఖ్యమంత్రి చంద్రబాబు తన భద్రతా సిబ్బందితో పాటు అధికారులను, ట్రాక్‌కు అటువైపు ఉన్నవారిని అప్రమత్తం చేశారు. హఠాత్ పరిణామం జరిగినప్పుడు ముఖ్యమంత్రి సమయస్ఫూర్తితో వ్యవహరించి, తనతో పాటు ఆ వంతెనపై ఉన్నవారినీ ప్రమాదం నుంచి తప్పించారని అందరూ అభినందిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.