సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే- వరద ముంపు ప్రాంతాల పరిశీలన - CM Chandrababu Aerial Survey - CM CHANDRABABU AERIAL SURVEY
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/06-09-2024/640-480-22392716-thumbnail-16x9-cm-chandrababu-aerial-survey.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 6, 2024, 7:14 PM IST
CM Chandrababu Aerial Survey in Flood Affected Areas : వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే చేశారు. హెలికాప్టర్ ద్వారా బుడమేరు డ్రైన్, కొల్లేరు ప్రాంతాలను పరిశీలించారు. బుడమేరు ప్రవాహం, ముంపు, గండ్లు పడిన ప్రాంతం, బ్యారేజ్ దిగువన కృష్ణా నది ప్రవాహం, కొల్లేరు ప్రాంతాలు తిరిగారు. బుడమేరు కట్ట తెగిన ప్రాంతాన్ని హెలికాప్టర్ ఏరియల్ సర్వే ద్వారా సీఎం పరిశీలించారు. గండ్లు పూడ్చే పనులను చూశారు. బుడమేరు ఏఏ ప్రాంతాల మీదుగా ప్రవహించి కొల్లేరు సరస్సులో కలుస్తుందో గమనించారు. బుడమేరు ఆక్రమణలకు గురైన ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు నిశితంగా పరిశీలించారు. బుడమేరుకు పడిన గండ్లు, గండ్లు పూడ్చే పనులను చూశారు. కొల్లేరు చుట్టూ ఉన్న గ్రామాల స్థితిని సీఎం పరిశీలించారు. ప్రకాశం బ్యారేజీకి దిగువన కృష్ణా నది ప్రవాహాలను, నది సముద్రంలో కలిసే హంసల దీవి ప్రాంతాన్ని, కృష్ణానది లంక గ్రామాలను సీఎం చంద్రబాబు పరిశీలించారు.