నర్సీపట్నం మున్సిపల్ సమావేశం రసాభాస - పట్టణ అభివృద్ధిపై అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం - రసాభాసగా కౌన్సిలర్ల సమావేశం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 5, 2024, 4:32 PM IST
Clash in Narsipatnam Municipal Office Over Urban Development: అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌన్సిలర్ల సమావేశం (Councillor meeting) రసాభాసగా సాగింది. పట్టణ అభివృద్ధి విషయంలో అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్లు బాహాబాహీకి దిగారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్ సుబ్బలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఇరు వర్గాల కౌన్సిలర్ల మధ్య వాదోపవాదలు చోటు చేసుకున్నాయి.
Argument Between Ruling and Opposition Councillors: వైస్ ఛైర్మన్ కోనేటి రామకృష్ణ (Vice Chairman Koneti Ramakrishna), టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు కుమారుడు 24వ వార్డు కౌన్సిలర్ చింతకాయల రాజేష్ (24th Ward Councilor Chintakayala Rajesh) మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సభ్యుల మధ్య మాటా మాటా పెరిగి, ఇరువర్గాలు మధ్య ఘర్షణతో తోపులాట జరిగింది. దీంతో ఈ సమావేశం గందరగోళంగా మారటంతో ఛైర్‌పర్సన్ సుబ్బలక్ష్మి కలగజేసుకుని ఇరువైపులా వారికి సర్ది చెప్పినా సభ్యులు ఎవరూ వినలేదు.