పోస్టల్ బ్యాలెట్ వినియోగంలో తీవ్ర ఉద్రిక్తత - ఎన్నికల అధికారులపై మండిపడ్డ ఉద్యోగులు - Clash during postal ballot vote - CLASH DURING POSTAL BALLOT VOTE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 3, 2024, 10:40 PM IST

Clash between Employees and Officers about Postal Ballot Vote in Anantapur District : ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగం సందర్భంగా అనంతపురం జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గంలోని టీడీడీసీ కేంద్రంలో ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేెశారు. అయితే ఉద్యోగులు ఓటును వినియోగించుకోవడానికి ఉదయమే కేంద్రానికి చేరుకున్న పోస్టల్ బ్యాలెట్ పత్రాలు మాత్రం రాలేదు. దీంతో సాయత్రం 4 గంటలు అయిన పోలింగ్ ప్రారంభం కాకపోవడంతో ఉద్యోగులు అసహనంతో అక్కడి ఎన్నికల అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

దీంతో పోస్టల్ పత్రాలలో గెజిటెడ్ అధికారి సంతకం, సీలు లేకుండా ఓటును వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. ఈ విధంగా ఓటు వేస్తే అవి ఎలా చెల్లుబాటు అవుతాయని ఉద్యోగులు ప్రశ్నించారు. కనీసం అవగాహన లేకుండా ఎలా వ్యవహరిస్తారని ఎన్నికల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగానే పోస్టల్ బ్యాలెట్​లో తీవ్ర జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగుల ఆందోళన చేపట్టడంతో సాయంత్రం ఐదున్నర సమయంలో ఆర్ఓ సంఘటన స్థలానికి చేరుకొని ఉద్యోగులకు సర్ది చెప్పారు. సంతకం, సీలు వేసి పోస్టల్ బ్యాలెట్ ఓటును వినియోగించుకునేలా చేశారు. అయితే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవడానికి ఒకరోజు అదనంగా కేటాయించాలని డిమాండ్ చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.