వినాయక చవితి చందాల విషయంలో వివాదం - రాళ్లతో దాడి, బైక్ ధ్వంసం - Clash Between Two Factions - CLASH BETWEEN TWO FACTIONS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 21, 2024, 4:02 PM IST
Clash Between Two Factions Led High Tension in Nellore District : చిన్న చిన్న కారణాలతో మాటా మాటా పెరిగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు జనాలు. ఇటీవల ఇటువంటి ఘటనలకు అదుపు లేకుండా పోతుంది. ఇలాంటి వివాదమే నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పంచాయతీ కట్టుబడిపాలెంలో జరిగింది. ఇరువర్గాల మధ్య జరిగిన ఈ ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది. వినాయక చవితి చందాల విషయంలో నెలకొన్న వివాదమే ఈ ఘర్షణకు కారణమని స్థానికులు చెప్తున్నారు. ఈ ఘర్షణలో కొంత మందికి గాయాలు కాగా ఇల్లు, బైక్ ధ్వంసమైంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కట్టుబడిపాలెంలో రహదారికి అడ్డంగా తాడు కట్టి కొందరు వినాయక చవితి చందాలు వసూలు చేస్తున్నారు. బైక్పై వెళ్తున్న మురళి అనే వ్యక్తి ఈ విధంగా చందాలు అడగడమేంటని ప్రశ్నించారు. దీంతో వారి మధ్య వాగ్వివాదం జరిగింది. ఇరు వర్గాలు రాళ్లతో దాడి చేసుకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు.