LIVE: "ఓటు వేద్దాం - ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేద్దాం" నినాదంతో ప్రజాస్వామ్య పరిరక్షణ సమావేశం
🎬 Watch Now: Feature Video
Citizens for Democracy Meeting Live : సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో కర్నూలు కొత్త బస్టాండు సమీపంలోని త్రిగుణ క్లార్క్స్ ఇన్ హాలులో 'ఓటు వేద్దాం - ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేద్దాం' నినాదంతో ప్రజాస్వామ్య పరిరక్షణ సమావేశం జరుగుతోంది. హైకోర్టు పూర్వ న్యాయ మూర్తి జస్టిస్ జి.భవాని ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సభకు తెలంగాణ రాష్ట్ర పూర్వ ప్రధాన ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ పూర్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రహ్మణ్యం, పూర్వ ప్రధాన ఎన్నికల కమిషనర్ డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఏపీ ఎన్జీవో అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి పాలంకి సుబ్బరాయన్తోపాటు రాష్ట్ర స్థాయిలో కృషి చేస్తున్న 36 పౌర సమాజ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.
రాష్ట్రంలో సుపరిపాలన కోరుకునే ఓటర్లందరూ విధిగా ఓటు హక్కు వినియోగించుకోవడం కీలకమని పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లోని ఓటర్లలో నెలకొన్న ఆనాసక్తి ధోరణి పోగొట్టాల్సిన అవసర ముందని, దీనికి పౌర సమాజ సంస్థలు గట్టిగా కృషి చేయాలని కోరారు. ప్రజా జీవితంలో గుణాత్మక మార్పులు తెచ్చేందుకు ఇతర సంస్థలతో కలిసి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ రాజకీయాలకు అతీతంగా కృషి చేస్తోందని.. దీనికి పౌర సమాజం స్పందించి సహకరించాలని కోరారు. రానున్న ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశిస్తున్న తరుణంలో పౌరులందరూ క్రియాశీలంగా వ్యవహరించాలని చెప్పారు.
"ఓటు వేద్దాం - ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేద్దాం" నినాదంతో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ - ప్రత్యక్ష ప్రసారం మీ కోసం