'ఓటు వేద్దాం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం' - విశాఖలో సీఎఫ్​డీ కళాజాత ప్రారంభం

🎬 Watch Now: Feature Video

thumbnail

Citizens for Democracy Kala Jathas Started: తిరుపతి ఓట్ల అక్రమాలపై ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలు కేవలం కంటితుడుపేనని సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ అన్నారు. విశాఖలోని గీతం వర్సిటీలో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఓటు వేద్దాం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం అనే నినాదంతో రాష్ట్ర స్థాయి కళాజాతను ప్రారంభించారు. కార్యక్రమంలో సీఎఫ్‌డీ ఛైర్మన్‌ లక్ష్మణ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ (Nimmagadda Ramesh Kumar) తదితరులు పాల్గొన్నారు. 

వాలంటీర్లపై సీఎం జగన్‌, మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పద్దతులు మంచివి కాదని హితవుపలికారు. ఓట్ల అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అన్ని జిల్లాలో కళారూపాలతో ప్రజల్లో చైతన్యం తెస్తామని సీఎఫ్​డీ ఛైర్మన్ లక్ష్మణ్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఓటర్ల తొలగింపు విష సంస్కృతి బయలుదేరిందన్న నిమ్మగడ్డ రమేశ్‌, ఈసీకి ఇచ్చిన ఫిర్యాదుల వల్లే అధికారులపై చర్యలు తీసుకున్నారని అన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.