ఏపీలో 80 శాతం పోలింగ్ నమోదుపై నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ హర్షం - Nimmagadda Ramesh Kumar on Polling - NIMMAGADDA RAMESH KUMAR ON POLLING

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 14, 2024, 4:35 PM IST

Citizen for Democracy General Secretary Nimmagadda Ramesh Kumar on Polling 2024 : సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో 80 శాతం వరకు పోలింగ్ నమోదు అవుతుందని సిటీజన్‌ ఫర్ డెమోక్రసీ ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్‌  కుమార్ హర్షం వ్యక్తం చేశారు. విదేశాల్లో, వివిధ రాష్ట్రాల్లో ఉన్న రాష్ట్ర ఓటర్లంతా విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు స్వస్థలాలకు రావడం స్వాగతించదగ్గ విషయమన్నారు. పల్నాడు, రాయలసీమ మరికొన్ని హింసాత్మక ఘటనలపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టాలన్నారు. ప్రజా చైతన్యం వల్ల మాత్రమే ఏపీ పోలింగ్ శాతం వృద్దికి దోహదపడిందని నిమ్మగడ్డ రమేష్​ అన్నారు. ఎన్నికల్లో జరిగిన హింసాత్మక ఘటనలు సిగ్గుచేటని ధ్వజమెత్తారు. పెద్ద ఎత్తున ప్రజల్ని గందరగోళానికి గురి చేసినా ప్రజలు వారి కర్తవ్యాన్ని నిర్వర్తించుకున్నారన్నారు. ​పోలింగ్​ సమయంలో జరిగిన విధ్వంసాలకు కారకులైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. రాష్ట్రంలో నమోదైన పోలింగ్​పై హర్షం వ్యక్తం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.