నారా లోకేశ్ 'రెడ్​బుక్'​ - సీఐడీ అరెస్టు పిటిషన్​పై విచారణ వాయిదా - Red book

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 13, 2024, 4:35 PM IST

CID Nara Lokesh Arrest Petition : తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్​ను అరెస్ట్ చేసేందుకు అనుమతి కావాలని సీఐడీ వేసిన పిటిషన్​పై విజయవాడ ఏసీబీ కోర్టు విచారణ జరిపింది. రెడ్ బుక్​లో దర్యాప్తు అధికారుల పేర్లు ఉన్నాయని భయపెడుతున్నారని, 41ఏ నిబంధలకు విరుద్ధంగా లోకేశ్ వ్యవహరిస్తున్నారని సీఐడీ అధికారులు కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణను ఈ నెల 21కి న్యాయస్థానం వాయిదా వేసింది.

తెలుగుదేశం కార్యకర్తలను, యువగళం (Yuvagalam) పాదయాత్రలో తనను పోలీసులు పలు సందర్భాల్లో ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురి చేశారని, అధికార పార్టీకి వత్తాసు పలికేలా వ్యవహరించారని టీడీపీ నేత లోకేశ్ గతంలో రెడ్​ బుక్ పేరుతో వ్యాఖ్యలు చేశారు. దీనిపై నోటీసులు అందించిన ఏపీ సీఐడీ లోకేశ్​ అరెస్టుకు ఆదేశాలు ఇవ్వాలని ఏసీబీ కోర్టును కోరింది. కాగా, సీఐడీ చర్యలపై ప్రతిపక్ష నేతలు సైతం అసహనం వ్యక్తం చేశారు. లోకేశ్​ రెడ్​బుక్​ అనగానే సీఐడీ అధికారులకు ఉలుకెందుకని ప్రశ్నించారు. అసలు రెడ్​బుక్ (Red book) అంటే ఏమిటో, అందులో ఎవరి పేర్లు రాశారో ఏమిటో తెలియకుండానే సీఐడీ అరెస్టుకు వరకూ వెళ్లడం సరికాదన్నారు. సీఐడీ దూకుడు వెనక ఏదో కుట్ర కోణం దాగుందని అనుమానాలు వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.