ఐఆర్​ఆర్​ కేసులో సీఐడీ చార్జిషీట్ - సీల్డ్‌ కవర్లో ఏసీబీ కోర్టుకు అందజేత

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 9, 2024, 12:06 PM IST

thumbnail

CID Chargesheet on Chandrababu Naidu in IRR Case : అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఇతరులపై విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ అభియోగపత్రాన్ని దాఖలు చేసింది. అవినీతి నిరోధక చట్టం సెక్షన్‌ 19 ప్రకారం గవర్నర్‌ అనుమతి తీసుకోకుండా దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను కోర్టు రిటర్న్‌ చేసే అవకాశముందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈఎస్‌ఐ కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడి విషయంలో దాఖలు చేసిన ఛార్జిషీట్‌ గవర్నర్‌ అనుమతి తీసుకోవాలని ఏసీబీ కోర్టు ఇటీవల అభిప్రాయం వ్యక్తం చేసింది.

AP CID Files Charge Sheet in IRR Case : సీఐడీ తాజాగా దాఖలు చేసిన అభియోగపత్రంలో చంద్రబాబు, అప్పటి పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ, హెరిటేజ్‌ ఫుడ్స్‌ డైరెక్టర్‌గా వ్యవహరించిన లోకేశ్ వ్యాపారవేత్త లింగమనేని రమేశ్, ఆయన సోదరుడు రాజశేఖర్‌ను నిందితులుగా పేర్కొన్నారు. చంద్రబాబు, నారాయణ ఏపీసీఆర్‌డీఏకి ఎక్స్‌అఫిషియో ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్లుగా వ్యవహరిస్తూ సింగపూర్‌ ప్రభుత్వానికి, ఏపీకి మధ్య అవగాహన ఒప్పందం జరిగిందని తప్పుగా చెప్పారని పేర్కొన్నారు. అలాంటి ఒప్పందం జరగలేదని, కేంద్రప్రభుత్వం నుంచి ఆ ఒప్పందానికి అనుమతి తీసుకోలేదన్నారు. రింగ్‌రోడ్డు, స్టార్టప్‌ ఏరియా మాస్టర్‌ప్లాన్‌ను నిందితులు తమ భూములకు దగ్గరగా ఉండేలా రూపొందించుకున్నారని ఆరోపించారు. ఇన్నర్‌రింగ్‌ రోడ్డు డిజైన్‌ చేసిన స్థలానికి పక్కనే హెరిటేజ్‌ ఫుడ్స్‌ సంస్థ 14ఎకరాలు కొనుగోలు చేసిందన్నారు. ఈ ఛార్జిషీట్‌ను సీల్డ్‌ కవర్లో ఏసీబీ కోర్టుకు అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.