టెక్కలిలో పోలీసు జులుం - విద్యుత్ ఉద్యోగిపై సీఐ దాడి - CI Attack on Electricity Employee - CI ATTACK ON ELECTRICITY EMPLOYEE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 22, 2024, 4:58 PM IST
CI Attack on Electricity Officer in Tekkali : ఓ చిరుద్యోగిపై పోలీసు అధికారి దాడి చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది.టెక్కలి రూరల్ పోలీస్ స్టేషన్ సీఐ చంద్రమౌళి సతీష్‌కుమార్ విద్యుత్ శాఖ ఉద్యోగి సతీష్ కుమార్‌పై దాడి చేశారు. సీఐ ఇంటికి విద్యుత్ కనెక్షన్ తొలగించానన్న కోపంతో స్టేషన్‌కు పిలిపించి తనపై దాడి చేశారంటూ బాధితుడు ఆరోపించాడు. సతీష్ కుమార్‌పై దాడిని ఉద్యోగుల సంఘం తీవ్రంగా ఖండించింది. సహ ఉద్యోగులంతా ఆసుపత్రికి చేరుకుని బాధితుని పరామర్శించారు. ఈ ఘటనపై జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి బాధితుడికి న్యాయం జరిగేవరకు పోరాడతామని సృష్టం చేశారు.
టెక్కలిలో సచివాలయ విద్యుత్ శాఖలో ఉద్యోగిగా పని చేస్తున్న రాజమహంతి సతీష్ కుమార్ బిల్లులు కట్టని సర్వీసు కనెక్షన్ తొలగింపు ప్రక్రియను అధికారులు అతనికి గురువారం అప్పగించారు. ఈ నేపథ్యంలో స్థానిక అయ్యప్పనగర్‌లో ఓ గృహ సముదాయం పరిధిలో మూడిళ్లకు తన జాబితా ప్రకారం విద్యుత్తు సేవలను నిలిపివేస్తూ ఫీజులు తొలగించారు.
విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఇంట్లో ఉన్న మహిళ ఎందుకు తొలగించారని సతీష్‌కుమార్‌ను ప్రశ్నించింది. అతను విద్యుత్ బిల్లులు చెల్లించనందున తొలగించినట్లు ఆమెకు తెలియజేశారు. దీంతో ఆమె ఫోన్ పే ద్వారా బిల్లులను చెల్లించింది. సతీష్ కుమార్ విద్యుత్ సేవలను పునరుద్ధరించి అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొద్ది సేపటికి టెక్కలి పోలీస్ స్టేషన్‌కు రావాల్సిందిగా అధికారులు సతీష్ కుమార్‌కి ఫోన్ చేశారు. అక్కడి వెళ్లిన సతీష్ కుమార్‌పై సీఐ సూర్య చంద్రమౌళి దాడి చేశారు. ప్రస్తుతం సతీష్ కుమార్ స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.