గిరిజన పాఠశాలలో 40 మందికి అస్వస్థత - విద్యార్థుల ఆరోగ్య స్థితిపై ఆరా తీసిన సీఎం - Childerns Food Poision - CHILDERNS FOOD POISION

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 31, 2024, 9:20 AM IST

Childerns Food Poision in Alluri District : కలుషిత ఆహారం తిని విద్యార్థినులు అస్వస్థతకు గురైన సంఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటుచేసుకుంది. అరకు నియోజకవర్గం బొందుగూడ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో కలుషిత ఆహారం తిని 40 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత గురయ్యారు. ఈ విషయం గమనించిన ఆశ్రమ సిబ్బంది హుటాహుటిన విద్యార్ధులను అరకు ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Bonduguda Tribal Welfare Girls Ashram : కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ  సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ఈ విషయంపై సీఎం కార్యాలయ అధికారులు జిల్లా అధికారులతో మాట్లాడారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. బాధిత విద్యార్థులకు మెరుగైన వైద్యం అందిచాలని సూచించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని జిల్లా వైద్యాధికారి జమాల్ బాషా తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.